← Back to news

సుప్రీంకోర్టుకు దానం నాగేందర్?

By Krishna· 11h ago
సుప్రీంకోర్టుకు దానం నాగేందర్?

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఎన్నిక చెల్లదు అని తెలంగాణ హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్ అయ్యింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. దానం రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే.. హైకోర్టు తీర్పుపై స్టే ఆర్డర్ తెచ్చుకుంటారా అనేది తేలాల్సిన అంశం. స్టే ఆర్డర్ వస్తే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.

More in TG