← Back to news

బిర్యానీ, పుచ్చకాయ విషాదం : జింక్ ఫాస్ఫైడ్ ఎందుకంత ప్రమాదం?

By aravinda nyayapati· 8 May 2026· Mumbai
బిర్యానీ, పుచ్చకాయ విషాదం : జింక్ ఫాస్ఫైడ్ ఎందుకంత ప్రమాదం?

ముంబైలో కుటుంబం మరణానికి బిర్యానీ, పుచ్చకాయ తినడం కాదని ఎలుకలు మందు అని తేలింది. దీంతో ఈ ప్రమాదకరమైన జింక్ ఫాస్ఫైడ్ గురించి చర్చ మొదలైంది. ఇది పొట్టలోని యాసిడ్‌తో కలవగానే ఫాస్ఫైన్ అనే విషవాయువును విడుదల చేస్తుంది. తిన్న ఆహారం వల్ల యాసిడ్ పెరిగి, ఈ గ్యాస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది. దీనికి ప్రపంచంలోనే యాంటీడోట్ అంటే విరుగుడు మందు లేదు. ఎలుకలు ముందు తిన్న వెంటనే కొబ్బరి నూనె తాగించి స్టమక్ వాష్ చేయడం వల్ల విషం రక్తంలో కలవకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.అందుకే ఎలుకల మందు వాడేటప్పుడు మనం తినే ఆహార పదార్థాల విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.