← Back to news

స్టాండప్ కమెడియన్ అనుదీప్ డిటెన్షన్

By DS· 16 Apr 2026· Telugu Report· visakhapatnam
స్టాండప్ కమెడియన్ అనుదీప్ డిటెన్షన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నీహారిక, నరేష్ ల పెళ్లిళ్లపై సెటైరికల్ జోక్స్ వేసిన స్టాండప్ కమెడియన్ కటికల అనుదీప్ ను ప్రయాగ్ రాజ్ లో కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేరెంట్స్ ను కలవడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లిన అనుదీప్ ను నిన్న సాయంత్రం 7 గం. కి డిటైన్ చేశారు. అతని పేరెంట్స్ తో కలిపి ట్రైన్ లో కాకినాడ తీసుకొస్తున్నారు. అనుదీప్ ఆన్ లైన్ వీడియోపై కాకినాడలో ఒక జనసేన నేత కంప్లైంట్ తో ఈ యాక్షన్ తీసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.