← Back to news

అరకు ఏరియా హాస్పిటల్‌కు బిగ్ రికగ్నిషన్

By B V Appalanaidu· 5h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకు ఏరియా హాస్పిటల్‌కు బిగ్ రికగ్నిషన్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ ఏరియా హాస్పిటల్‌కు ‘స్వచ్ఛంద్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛ ఆస్పత్రి’ విభాగంలో అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి చేతులమీదుగా ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా DCHS డా.లగుడు రాము అవార్డును అందుకున్నారు. వరుసగా రెండోసారి ఈ గుర్తింపు దక్కడం గర్వకారణమని డా.లగుడు రాము తెలిపారు. ఆస్పత్రిలో పరిశుభ్రతతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డు లభించిందని చెప్పారు.

More in Local