← Back to news

ఉద్యోగ అవకాశాల కోసం ఫ్రీ స్కిల్ ట్రైనింగ్

By Ravi M· 1h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
ఉద్యోగ అవకాశాల కోసం ఫ్రీ స్కిల్ ట్రైనింగ్

నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు DDU-GKY, NAC నిజామాబాద్ ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు NAC అసిస్టెంట్ డైరెక్టర్ జె.లింబాద్రి తెలిపారు. ఎలక్ట్రీషియన్, ల్యాండ్ సర్వేయర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. SSC లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9296507557 నంబర్‌కు ఫోన్ చేయలని సూచించారు.

More in Local