← Back to news

‘సత్యాగ్రహ’ కార్యక్రమం అనౌన్స్ చేసిన రాహుల్ గాంధీ

By Vishi· 3h ago· X

హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ల కథలన్నీ ఒక చోట చేరేలా ‘సత్యాగ్రహ’ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రతి పోరాటానికి ఒక కథ ఉందని, అయితే ఒంటరిగా ఎత్తిన గొంతును అణగదొక్కుతున్నారని అన్నారు. ఈ కథలన్నింటినీ ఒకే చోటకు తీసుకురావడానికే ‘సత్యాగ్రహ’ ప్రారంభించామన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీ కథ చెప్పాలని, ప్రతిపక్షనేతగా పార్లమెంట్‌లో, వీధుల్లో, అవసరమైన చోట నిలబడి సాధ్యమైనంత సాయం చేస్తానని చెప్పారు.

More in Current Affairs