← Back to news

PAN కరెక్షన్.. ఇలా మార్చండి!

By Mahesh· 7h ago· Proteantech
PAN కరెక్షన్.. ఇలా మార్చండి!

PAN కార్డులో పేరు, DOB వంటి తప్పులున్నాయా? ఇక ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. Protean <a href="https://onlineservices.proteantech.in/paam/endUserRegisterContact.html">ఆఫిషియల్ పోర్టల్</a> ద్వారా ఇంటి నుంచే కరెక్షన్స్ చేసుకోవచ్చు. ముందుగా ‘Changes or Correction in Existing PAN Data’ ఆప్షన్ ఎంచుకుని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే టోకెన్ నంబర్ వస్తుంది. ఆధార్ e-KYCతో పేరు కరెక్షన్ చేయొచ్చు. DOB కోసం టెన్త్ మార్క్‌షీట్, పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఫోటో, సంతకం మార్చాలంటే డిజిటల్ ఫైల్స్ అప్‌లోడ్ చేయాలి.

More in Infotainment