ముంబైలో జంతర్ మంతర్ సీజన్-2 ప్రారంభం: సంజయ్ రౌత్
ఇవాళ ముంబైలో జరిగిన CJP ఆందోళనను జంతర్ మంతర్ సీజన్-2గా శివసేన(UBT) ఎంపీ సంజయ్ రౌత్ తన పోస్ట్‌లో వర్ణించారు. CEC జ్ఞానేష్ కుమార్ తప్పనిసరిగా రిజైన్ చేయాలని, ఆయన ఈ విషయం తెలుసుకోవాలని రాశారు. ఇంతకు ముందు ఢిల్లీ జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ విషయంలో 36 రోజుల పాటు సాగిన ఆందోళనను సీజన్-1గా చెప్పుకుంటున్నారు. ముంబైలో జరిగిన CJP నిరసనలో నటుడు నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, గాయకుడు విశాల్ దద్లానీ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

