← Back to news

పెన్షన్లు పంపిణీ చేసిన BJP నేత జొన్నడ రంజిత్

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram
పెన్షన్లు పంపిణీ చేసిన BJP నేత జొన్నడ రంజిత్

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని 20వ వార్డులో NTR భరోసా పెన్షన్లను BJP విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యుడు జొన్నడ రంజిత్ పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బందితో కలిసి వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించారు. అనంతరం రంజిత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు.

More in Local