ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్ అరెస్ట్!

యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తించిన పోలీసులు, APలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫైల్ అయిన కేసుల ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.


