← Back to news

ఏపీలో యోగి ఆదిత్యానాథ్ తెలుగు స్పీచ్

By Vishi· 1h ago
ఏపీలో యోగి ఆదిత్యానాథ్ తెలుగు స్పీచ్

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఏపీకి వచ్చారు. నెల్లూరులోని వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా యోగి ఆదిత్యానాథ్ పాల్గొని ట్రస్ట్ 25 ఏళ్లుగా సేవలందించడం అభినందనీయమన్నారు. ‘అందరికీ ధన్యవాదాలు. మీ స్వాగతాలకు ధన్యవాదాలు. మీ మధ్యకు రావడం ఆనందంగా ఉంది’ అంటూ స్పీచ్ ప్రారంభించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఎంపీ మస్తాన్‌రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ హాజరయ్యారు.

More in Current Affairs