← Back to news

గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ సస్పెన్షన్

By Srikanth Goud· 1h ago· Rajanna Sircilla
గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్సై చొక్కాల శ్రీకాంత్ సస్పెన్షన్‌కు గురయ్యారు. నిబంధనల ఉల్లంఘన, విధుల్లో నిర్లక్ష్యం, అదుపులో ఉన్న నిందితులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో మల్టీజోన్-1 ఐజీ, జోన్-3 డీఐజీ ఇన్‌చార్జ్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్‌ను డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. సస్పెన్షన్ సమయంలో అనుమతి లేకుండా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు.

More in Local