← Back to news

యువతా.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి!

By YSR· 1h ago· Khammam
యువతా.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి!

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఖమ్మం జిల్లా యువజన అధికారి ఎం. వెంకట్ రాంబాబు సూచించారు. జక్కేపల్లిలో నిర్వహించిన నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వాటికి బానిసైనవారు పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందవచ్చన్నారు. 15–29 ఏళ్ల యువత మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

More in Local