← Back to news

వన్యప్రాణుల రక్షణపై అవగాహన మారథాన్

By DK· 6 Oct 2026
వన్యప్రాణుల రక్షణపై అవగాహన మారథాన్

ప్రకాశం జిల్లా కోమరోలులో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బేస్తవారిపేట రేంజ్ ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి, అటవీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “వన్యప్రాణులను కాపాడుదాం–అడవులను సంరక్షిద్దాం” అనే సందేశంతో మారథాన్ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.

More in Lifestyle