← Back to news

ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో 10 రోజులు ఇంతే

By aravinda nyayapati· 10 Apr 2026· Telugu Report· Hyderabad
ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో 10 రోజులు ఇంతే

తెలంగాణలో భానుడు భగభగలాడనున్నాడు! ఏప్రిల్ 10 నుండి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నెల 22 వరకు ఎండలు అత్యధికంగా ఉంటాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ సూచనలు: మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు బయటకు రావద్దు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి, ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా (నీరు, ORS తాగుతూ) ఉండాలి. ఉప్పు, కారం, నూనె వస్తువులకు దూరంగా ఉండాలి. తలనొప్పి, కండరాల బలహీనత లేదా స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి!

More in Local