← Back to news

ఫేక్ పార్టీలు.. బోగస్‌ విరాళాలు

By A.Ajay· 1h ago
ఫేక్ పార్టీలు.. బోగస్‌ విరాళాలు

గుజరాత్‌లో కొత్త రకం మోసం బయటపడింది. 3 నకిలీ రాజకీయ పార్టీలు ఏర్పాటై.. ప్రజల నుంచి 1,870 కోట్ల విరాళాలు తీసుకున్నాయి. కొంత కమీషన్ పొంది, తిరిగి ఆ డబ్బును వెనక్కి ఇచ్చేశాయి. ఐతే.. విరాళాలు ఇచ్చిన వారు.. అలా ఇచ్చినట్లు చెప్పుకొని టాక్స్ మినహాయింపులు పొందారు. ఇలా 560 కోట్లకు పైగా టాక్స్ చెల్లించలేదు. పోలీసులు ఆ 3 పార్టీలపై కేసులు నమోదు చేశారు. సంవత్సరం పాటూ దర్యాప్తు తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయి.

More in National