పద్మశ్రీ అవార్డీ హరేకల హజబ్బకు EC నోటీసు?

పద్మశ్రీ అవార్డు అందుకున్న <a href="https://www.v6velugu.com/padma-shri-awardee-harekala-hajabba-gets-sir-notice-over-name-discrepancy">హరేకల హజబ్బకు</a> ఎలక్షన్ కమిషన్ (EC) నుంచి నోటీసు వచ్చింది. కర్ణాటకలో ఓటర్ల లిస్ట్ SIR ప్రాసెస్‌లో భాగంగా ఈ నోటీసు ఇచ్చారు. 2002 ఓటర్ లిస్ట్‌లో ఆయన పేరు ‘హజబ్బ’గా ఉండగా.. ఆధార్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, కొత్త ఓటర్ ఐడీలో ‘హరేకల హజబ్బ’గా ఉంది. పేరులో ఈ డిఫరెన్స్‌పై EC ఆఫీసర్స్ నోటీసు ఇచ్చారు. సెప్టెంబర్ 11న గ్రామ పంచాయతీ ముందు హాజరై డాక్యుమెంట్స్ చూపించాలని ఆయనకు తెలిపారు. ఈ చిన్న ఇష్యూ త్వరలోనే క్లియర్ అవుతుందని హజబ్బ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


