విసిగిపోయి రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు

TG: కొమురంభీమ్ జిల్లా పెంచికల్పేట మండలం బొంబాయిగూడాలో వర్షపునీరు, బురదతో రోడ్లు అధ్వానంగా మారడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నాగపురివాడలో రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోడ్లపై రోజుల తరబడి బురదనీరు నిలవడంతో దుర్వాసన వస్తోందని, రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. విసిగిపోయిన కాలనీవాసులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.



