ఢిల్లీ ఘటనపై న్యాయ విచారణ జరపాలి: అనిల్ బాబు

ఢిల్లీలో నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, వారిపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) మహబూబాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు నిమ్మనగంటి అనిల్ బాబు డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళా నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జి, అనుచితంగా తాకడం వంటి ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. వీడియోలు, CCTV దృశ్యాలు ఆధారంగా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





