నటుడు ఫహద్ ఫాజిల్‌కు మహేష్‌బాబు ప్రశంస

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాను నటుడు మహేశ్ బాబు చూసి తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని, పూర్తిగా వినోదభరితంగా సాగిందని అన్నారు. , అదే టైంలో సినిమా అందర్నీ లోతుగా కదిలిస్తుందని చెప్పారు. నటుడు ఫహద్ ఫాజిల్‌ని ‘ఫహద్ సార్’ అంటూ ‘మీరు అద్భుతమైన నటుడు. మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారో, ప్రయోగాలు చేస్తున్నారో, మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకుంటున్నారో చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం’ అని రాశారు.


