← Back to news

10 రోజుల్లో భూ రీసర్వే పూర్తి చేయాలి

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 1h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
10 రోజుల్లో భూ రీసర్వే పూర్తి చేయాలి

TG: నాగర్ కర్నూల్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లను రికార్డులతో సరిపోల్చి ఖచ్చితత్వం, పారదర్శకతతో రీ-సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అలాగే SIR ప్రక్రియను బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్ల సమన్వయంతో సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రికార్డుల పరిశీలనతో ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.

More in Local