బతికున్న కూతురికి అంత్యక్రియలు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో షాకింగ్ ఘటన జరిగింది. నేహా అనే యువతి రెండు నెలల క్రితం వేరే కులానికి చెందిన సావన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి, బతికున్న కూతురికి నిన్న ఆమె చనిపోయినట్లు అంత్యక్రియల తంతు నిర్వహించి, పిండప్రదానం చేశాడు. ప్రస్తుతం నేహా తన భర్తతో కలిసి సోన్‌భద్రలో ఉంటోంది. ప్రేమ పెళ్లిపై కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



