← Back to news

పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR

By dk· 9 Aug 2026· వరంగల్ జిల్లా
పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR

TG: ఇటీవల అనారోగ్యంతో <a href="https://www.theclearcutnews.com/n/XCo6KYd">మృతి</a> చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి BRS అధినేత <a href="https://www.theclearcutnews.com/n/4SpPAcV">KCR</a> హాజరయ్యారు. నల్లబెల్లి గ్రామానికి చేరుకున్న ఆయన‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, భార్య, పిల్లలను ఓదార్చారు. సుదర్శన్‌రెడ్డి మరణం పార్టీకి, నియోజకవర్గానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR
పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం: KCR

More in TG