మెటాపై అభిజీత్ దీప్కే సీరియస్

ఇన్స్టాగ్రామ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులను <a href="https://www.theclearcutnews.com/n/YVMuREJ">మెటా రీమూవ్</a> చేస్తోందని, ఫ్రీ స్పీచ్‌ను అణచివేస్తోందని CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకపోయినా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పేరుతో పోస్టులు తొలగిస్తూ, కొల్లాబ్ ఫీచర్‌ను డిసేబుల్ చేశారని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి వాక్ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయవద్దని, తక్షణమే తమ అకౌంట్లపై ఉన్న ఆంక్షలను తొలగించాలని మెటా యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు.



