ఆశా కార్యకర్తలకు CPRపై అవగాహన

AP: బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, ANMలకు CPRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఎలా కాపాడాలో తెనాలి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు ప్రాక్టికల్‌గా వివరించారు. మానికిన్‌పై CPR ప్రక్రియను ప్రదర్శించి, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలను అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెరవలి PHC డాక్టర్ కే.సౌమ్య, వేమూరు PHC డాక్టర్ రెజీనా పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.





