GO 97 వద్దంటే.. అరెస్టులు!
TG: రాయదుర్గంలో GO 97 రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. GO 97 అనేది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్. దీని ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - YISUస, శక్తి విభాగం పరిధిలోకి తీసుకురావాలనేది నిర్ణయం. కొంతకాలంగా విద్యార్థులు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నారు.



