జాబ్ డ్రైవ్లో అరకు విద్యార్థినుల ప్రతిభ.. SBIలో ఉద్యోగాలు!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థినులు జాబ్ డ్రైవ్లో ప్రతిభ కనబరిచారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన డ్రైవ్కు 16 మంది హాజరయ్యారు. కె. నాగశ్రీ, బి. శైలజ, కె. దుర్గ, కె. సౌజన్య.. వీరంతా SBIలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గురువారం విధుల్లో చేరారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి, అధ్యాపకులు, సిబ్బంది వారిని అభినందించారు.


