← Back to news

అధికారం పోయాకే హక్కులు గుర్తొచ్చాయా: ఉత్తమ్

By dk· 6 Aug 2026· హైదరాబాద్
అధికారం పోయాకే హక్కులు గుర్తొచ్చాయా: ఉత్తమ్

TG: తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ సంపదను దోచుకున్న BRS నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముడుపుల ఆరోపణలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. AP ప్రభుత్వం ప్రాజెక్టులను వ్యతిరేకించిన ప్రతిసారి తమ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడిందన్నారు.

More in TG