← Back to news

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో బాలికపై అఘాయిత్యం!

By sahani· 2 Jul 2026
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో బాలికపై అఘాయిత్యం!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో ఓ 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా పొక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.19 వేల జరిమానా విధించింది. 2020 కోవిడ్ టైంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ వాడుతున్న బాలికకు సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటస్వామి(29) పరిచయమయ్యాడు. ఆపై బెదిరింపులకు గురిచేసి కిడ్నాప్ చేశాడు. బాధితురాలికి ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ అలర్ట్‌గా ఉండాలి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.