← Back to news

విద్యార్థులను కలవని VC.. SFI ఆగ్రహం

By DK· 52m ago
విద్యార్థులను కలవని VC.. SFI ఆగ్రహం

AP: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పారామెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థుల సమస్యలపై SFI రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల సమస్యలపై వైస్‌ ఛాన్సలర్‌ చంద్రశేఖర్‌ను కలిసేందుకు వెళ్లిన SFI నాయకులను ఆయన కలవకుండా మరో సమావేశానికి వెళ్లడాన్ని నాయకులు ఖండించారు. నాలుగేళ్ల కోర్సులు జాప్యంతో ఆరేళ్లకు చేరుతున్నాయని, ఇంటర్న్‌షిప్‌కు స్టైపెండ్‌ చెల్లించడం లేదన్నారు. ప్రతి విద్యార్థికి నెలకు ₹15,000 స్టైపెండ్‌, సకాలంలో పరీక్షలు, ఫలితాలు, అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకటించాలన్నారు.

More in Local