పండుగ వేళ చక్కెర నిల్వ పరిమితిని తగ్గించిన మోడీ సర్కార్

పండుగల వేళ చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర డీలర్లు 15 రోజులకు మించి నిల్వ ఉంచకూడదని, ఏ ప్రాంతంలోనైనా 1,000 క్వింటాళ్లకు మించి నిల్వ చేయకూడదని కేంద్రం తెలిపింది. ఆగస్టు గరిష్ఠంతో పోలిస్తే చక్కెర రిటైల్ ధరలు 15 శాతం, మిల్లుల వద్ద ధరలు 28 శాతం తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. పండుగల సమయంలో సరఫరా సజావుగా ఉండేలా ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది.
