నోయిడాలో కార్మికుల నిరసన ఉద్రిక్తం
యూపీలోని నోయిడా ఫేజ్-2లో కార్మికులు జీతాలు పెంచాలన్న డిమాండ్ తో భారీ నిరసన చేపట్టారు. హర్యానా తరహాలో 35% జీతాల పెంపు కోరుతూ జరిగిన ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రతి నెలా 10లోపు జీతాలు ఇవ్వాలని, ఓవర్ టైమ్‌కు రెట్టింపు డబ్బులు ఇవ్వాలని అధికారులు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి.



