గిరిజన బాలిక.. జాతీయ రగ్బీలో!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం రణజిల్లెడకు చెందిన గౌతీ మీనన్ జాతీయ రగ్బీ పోటీలకు ఎంపికైంది. సోమెలి దాసు కుమార్తె అయిన ఆమె భీమిలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.


