బెల్ట్‌షాపులు, డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

TG: నూతనంగా విధుల్లో చేరిన ఎక్సైజ్ సీఐ జయశ్రీకి అక్రమ మద్యం, డ్రగ్స్ నియంత్రణపై వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆప్కారి శాఖ కార్యాలయంలో సీఐ జయశ్రీని వారు ఘనంగా స్వాగతించి వినతిపత్రం అందజేశారు. డివిజన్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులు, అధిక ధరల వసూళ్లు, మద్యం దుకాణాల ఎదుట ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ మాఫియాను అరికట్టి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.



