← Back to news

వాగు.. దాటితేనే సాగు

By A.Ajay· 1h ago
వాగు.. దాటితేనే సాగు

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రామవరంలో పాలేరు వాగు దాటితేనే రైతులు పొలాలకు చేరుకోవాల్సి వస్తోంది. వర్షాలు పడితే వాగు ఉధృతంగా మారడంతో గ్రామస్థులు తెప్పలు, పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 80 ఏళ్లుగా ఈ సమస్య ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. 120 మంది రైతులకు 230 ఎకరాల పొలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుతున్నారు. 2015లో బ్రిడ్జి నిర్మాణానికి 10 లక్షలు కేటాయించినా పనులు పూర్తికాలేదని తెలిపారు. దీంతో వర్షాకాలంలో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి.

More in TG