← Back to news

ఆర్చరీలో అదరగొట్టిన తెలుగమ్మాయి

By Srikanth Goud· 1h ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
ఆర్చరీలో అదరగొట్టిన తెలుగమ్మాయి

తెలుగమ్మాయి చికిత తానిపర్తి ఆసియా క్రీడల్లో సత్తాచాటారు. ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన జట్లలో భాగమై మెరిశారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన చికితకు చిన్నప్పటి నుంచే ఆర్చరీపై ఆసక్తి ఉంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో క్రీడలో ముందుకు సాగారు. 2022లో సోనిపట్‌ ఆర్చరీ అకాడమీలో చేరిన చికిత.. కఠిన శిక్షణతో తన ప్రతిభను మెరుగుపర్చుకున్నారు. 2025 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి గుర్తింపు పొందారు.

More in TG