← Back to news

ఓవర్సీస్ విద్యానిధి అప్‌డేట్

By A.Ajay· 49m ago
ఓవర్సీస్ విద్యానిధి అప్‌డేట్

TG: విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే తెలంగాణ BC, EBC విద్యార్థులకు ప్రభుత్వం గడువు పెంచింది. 'మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం' కింద అప్లికేషన్ల చివరి తేదీని అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ఏడాది తొలి, రెండో విడతల్లో 180 మంది విద్యార్థులకు 18కోట్ల 40లక్షల సాయం విడుదల చేసినట్లు తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల్లోపు ఉండాలి. డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలి. వివరాలు <a href="https://telanganaepass.cgg.gov.in/?utm_source.com">ePASS</a>లో చూడవచ్చు.

More in TG