← Back to news

వేధింపులపై పాదయాత్రకు దిగిన చంద్రారెడ్డి

By DK· 1h ago
వేధింపులపై పాదయాత్రకు దిగిన చంద్రారెడ్డి

TG: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని చంద్రారెడ్డి తనకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని పాదయాత్ర చేపట్టారు. చేతిలో ‘పాదయాత్ర.. న్యాయం చేయండి’ అనే ప్లకార్డు పట్టుకుని తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని చంద్రారెడ్డి ఆరోపించారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, రాజకీయ పలుకుబడితో కేసులు నమోదు కాకుండా తప్పించుకుంటున్నారన్నారు.

More in Local