ఆఫ్రికాలో కొత్త సముద్రం ఏర్పడుతుందా ?

ఆఫ్రికా ఖండం నెమ్మదిగా రెండు ముక్కలుగా విడిపోతోంది. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఈ పరిణామం ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ ఖండం తూర్పు భాగంలో ఏర్పడిన భారీ చీలిక (East African Rift) వల్ల భవిష్యత్తులో ఒక కొత్త సముద్రం ఏర్పడబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతుండటమే దీనికి కారణం. అయితే ఇదంతా జరగడానికి మరో 5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.



