← Back to news

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

By డీకే· 2 Jul 2026· హైదరాబాద్‌
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

TG:శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ వీసా మోసం ఘటన కలకలం రేపింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన APలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చాడని మహిళలు వాపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.