కాళేశ్వరం నీళ్లు రాలే.. పంట ఎండింది

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో మహిళా రైతు లక్ష్మి నిరసన తెలిపారు. కాళేశ్వరం నీళ్లు రాక తన పంట ఎండిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన నిరసనను చాటుకున్నారు. కాలువలో నీళ్లు అందితే పంట దక్కేదని ఆమె అన్నారు. ప్రస్తుతం అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎంత కాలమని, తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.


