← Back to news

రాజాంలో తాగునీటి సరఫరాపై కమిషనర్ పరిశీలన

By Mohan· 1h ago· Vizianagaram
రాజాంలో తాగునీటి సరఫరాపై కమిషనర్ పరిశీలన

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మంచినీటి సరఫరా తీరును మున్సిపల్ కమిషనర్ A. రామచంద్రరావు శనివారం పరిశీలించారు. అమ్మవారి కాలనీ సమీపంలోని నాలుగు వాటర్ ట్యాంకులను రెండు రోజుల క్రితం శుభ్రం చేయించినట్లు తెలిపారు. వాటి ద్వారా నీరు సరఫరా అయ్యే వస్త్రపూరి కాలనీ, ఆదర్శనగర్, కొండంపేట, అమ్మవారి కాలనీ, మల్లయ్యపేట, మెంతిపేట ప్రాంతాల్లో పర్యటించి సరఫరా పరిస్థితిని తనిఖీ చేశారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు పరిశుభ్రమైన తాగునీరు అందుతోందని చెప్పారు.

More in Local