ట్రోలర్లకు అల్లు శిరీష్ కౌంటర్

గణేష్ నవరాత్రుల్లో DJ సౌండ్లపై పోలీసులకు కంప్లైంట్ చేసినందుకు, తనను <a href="https://www.theclearcutnews.com/n/XNt789r">ట్రోల్ చేస్తున్న వారికి</a> కౌంటర్ ఇచ్చారు నటుడు అల్లు శిరీష్. "నేను స్వయంగా భక్తిపరుడిని. హనుమంతుడిని పూజిస్తాను. తెల్లవారుజామున 2 గంటలకు DJ సెటప్‌తో పెద్దగా మ్యూజిక్ పెట్టడం భక్తి కాదు. నేను కంప్లైంట్ చేసింది పౌర స్పృహ గురించి, భక్తి గురించి కాదు" అని ట్వీట్ చేశారు. ఈ అంశంపై తాను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం సరైన నిర్ణయమే అని ఆయన చెప్పినట్లైంది.


