ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా రైతులు రానున్న యాసంగి సీజన్‌లో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ సూచించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, కాలువల ద్వారా సాగునీరు అందించడం కష్టమవచ్చని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి నీటి చుక్కను విలువైనదిగా భావించాలని చెప్పారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు.



