పనులు పూర్తికాకముందే కూలుతున్న స్తంభాలు

కర్నూలు జిల్లా పెంచలపాడు నుంచి చాబాల వరకు ₹10 లక్షలతో నిర్మిస్తున్న 33 కేవీ విద్యుత్తు లైన్ పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పది కిలోమీటర్ల మేర పనులు ఇంకా పూర్తికాకముందే, వేసిన 200లకి పైగా స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి. చిన్న వర్షాలకే స్తంభాలు వాలిపోవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.



