మెడికల్ షాపుల్లో CCTV? కేంద్రం కీలక ప్రపోజల్!

మెడికల్ షాపుల్లో మందుల అమ్మకాలపై ఇక మరింత నిఘా ఉండే అవకాశముంది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రపోజ్ చేసిన డ్రగ్స్ రూల్స్ అమెండ్‌మెంట్ ప్రకారం, మెడికల్ స్టోర్లలో మెడిసిన్స్ కొనే టైమ్‌లో CCTVలో రికార్డింగ్ చేయాల్సి రావచ్చు. ఈ ఫుటేజ్‌ను కనీసం 3 నెలలు భద్రపరచాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ తప్పనిసరైన Schedule H, H1, X మందుల అమ్మకాలపై నిఘా పెంచడం లక్ష్యం. అయితే ఇది ప్రస్తుతం డ్రాఫ్ట్ ప్రపోజల్ మాత్రమే.



