నెస్లే ఇండియాపై FSSAI చర్యలు

చిన్న పిల్లల ఆహార ప్రాడక్స్‌పై రూల్స్ అతిక్రమించిందని నెస్లే ఇండియాపై FSSAI చట్టపరమైన చర్యలు చేపట్టింది. నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1, లాక్టోజన్ ప్రో 1 తదితర ఉత్పత్తులపై ఈ-కామర్స్ వేదికల్లో ప్రచారాలను గుర్తించినట్లు తెలిపింది. పిల్లల ఆహార విక్రయాలను పెంచే ప్రకటనలు నిషేధమని స్పష్టం చేసింది. నెస్లే ఫార్ములాలో బయోటిన్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించి మూడు కేసులు నమోదు చేసింది. దీంతో నెస్లే షేరు 2 శాతం నష్టపోయింది.



