ఏనుగల్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా గుండ రాకేష్!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలక మండలి ఎన్నికలు గురువారం జరిగాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా, తొమ్మిది మంది పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో గుండ రాకేష్ అధ్యక్షుడిగా, నర్ర చంద్రమౌళి ఉపాధ్యక్షుడిగా, ధోని దేవేందర్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.


