అడవిలో వేట.. ముగ్గురు అరెస్ట్!

మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్‌లో అడవి ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లకమ్మ రేంజ్, రాచెర్ల సెక్షన్, అంబవరం బీట్, ENB-I రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉచ్చులు బిగించి వేటాడారు. నిందితులు గోగుల శ్రీను, భూపాని వెంకట లక్ష్మీ నారాయణ, గుర్రం పెద్ద గురవయ్య. కోర్టు 14 రోజుల రిమాండ్ విచ్చింది. వారిని ఒంగోలు డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు. చుక్కల దుప్పి రక్షణ జాబితాలో ఉంది. వేటాడటం తీవ్ర నేరం.


