← Back to news

డ్రిప్ సేద్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

By Md Jabeer· 1h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
డ్రిప్ సేద్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

TG: నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ గ్రామంలో బిందు సేద్యపు (డ్రిప్) ఏర్పాట్లను ఉద్యానవన శాఖ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్ డివిజన్ ఉద్యానవన అధికారి మౌనిక, జైన్ సంస్థ ప్రతినిధులు, DCO నాగరాజు తదితరులు రైతు తిరుపతిరెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలు, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన పరికరాల వినియోగంతో తక్కువ నీటితో మెరుగైన సాగు సాధ్యమని, డ్రిప్ నిర్వహణపై రైతులకు పలు సూచనలు చేశారు.

More in Local